కిర్ల నుంచి 273వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 273వ రోజు పాదయాత్రను శ‌నివారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని  కిర్ల నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి జామి మండలం జిడ్డేటి వలస క్రాస్‌ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్‌ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  మధ్యాహ్నా భోజన విరామం అనంత‌రం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 

 జిల్లాలో వైయ‌స్ జగన్‌మెహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు జనాభిమానం వెల్లువెత్తుతోంది. అడుగడుగునా జననేతకు నీరాజనం పడుతున్నారు.   ఆయన వెంట జిల్లా వాసులు  అడుగులో అడుగు వేస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రిస్తూ, అంద‌రికీ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top