వైయ‌స్ జ‌గ‌న్ 27వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


 అనంతపురం: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి 27వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించారు.  అనంతపురం జిల్లా గుత్తిలో మంగ‌ళ‌వారం ఉదయం 8 గంటలకు వైయ‌స్ జగన్ పాదయాత్ర మొద‌లైంది. అక్క‌డి నుంచి ఆవులంపల్లి క్రాస్‌లో జనంతో మమేకం అవుతారు. పెద్దవడుగూరులో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. చిన్నవడుగూరులో జనంతో మమేకమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం బస చేస్తారు.  
 

Back to Top