పెందుర్తి నుంచి 269వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. సోమవారం ఉదయం జననేత 269వ రోజు పాదయాత్రను పెందుర్తి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సారిపల్లి, జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం, దేశపాత్రుని పాలెం, కొత్త వలస మీదుగా తుమ్మికపాలెం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. దేశపాత్రునిపాలెం చేరుకోగానే జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర   ప్రారంభమైంది 

 
 

Back to Top