ముగిసిన వైయ‌స్ జ‌గ‌న్ 24వ రోజు పాద‌యాత్ర‌

క‌ర్నూలు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  24వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రిత‌మే ముగిసింది. శ‌నివారం ఉద‌యం కర్నూలు  జిల్లా పత్తికొండ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించి రాతన, తుగ్గలి, గిరిగట్ల మీదుగా మదనంతపురం క్రాస్‌ వరకు కొన‌సాగింది. రాత‌న‌, తుగ్గ‌లి గ్రామాల్లో రైతుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. ప‌త్తిపంట‌ల‌ను ప‌రిశీలించారు. ట‌మాట రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.  రాతన గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు.  సాయంత్రం మదనంతపురం క్రాస్‌ లో ప్రజలతో వైయ‌స్ జగన్‌ మమేకం అయ్యారు. 
Back to Top