కొవ్వాడ నుంచి 215వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్రను జననేత ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఈ రోజు పాదయాత్రలో ఛీడిగా మీదుగా ఇంద్ర పాలెం చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కాకినాడ ఏఆర్‌సీ సెంటర్‌, సంతచెరువు, కల్పన సెంటర్‌, కోకిల సెంటర్‌ మీదుగా ఆదిత్యా కళాశాల సెంటర్‌ వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.  
 


Back to Top