వెంకటరామన్న గూడెం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభమైంది. వైయ‌స్ఆర్‌సీపీ రాజకీయ సలహాదారు సోమయాజులు మృతి కారణంగా ఆదివారం జననేత వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. విరామం అనంతరం సోమవారం ఉదయం అశేష ప్రజానీకం నడుమ వైయ‌స్ జ‌గ‌న్ వెంక‌ట‌రామ‌న్న గూడెం నుంచి పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. ఇవాళ వెల్లమిల్లి, పెద్ద తాడేపల్లి  మీదుగా తాడేపల్లిగూడెం మార్కెట్‌ ప్లేస్‌ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  

Back to Top