కొద్దిసేప‌ట్లో మ‌హిళా స‌ద‌స్సు

క‌ర్నూలు: బ‌న‌గాన‌ప‌ల్ల నియోజ‌క‌వ‌ర్గంలోని హుశ్సేనాపురం గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నారు. మ‌రి కొద్దిసేప‌ట్లో ఈ స‌ద‌స్సు ప్రారంభం కానుండ‌గా ప్ర‌జా సంక‌ల్ప యాత్రతో పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ ఇందులో పాల్గొంటారు. ఇవాళ ఉద‌యం బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి జ‌న‌నేత పాద‌యాత్ర ప్రారంభం అయ్యింది. అక్క‌డి నుంచి హుశ్సేనాపురం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ స‌ద‌స్సులో పాల్గొని మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు.  అనంతరం గ్రామంలో  పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. 

Back to Top