106వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

ప్ర‌కాశం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 106వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. బుధవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. హనుమోజి పాలెం, జారుబులవారి పాలెం, కొండవల్లివారి పాలెం నుంచి కేశవరపుపాడుకు చేరుకుని జెండా ఆవిష్కరణ చేస్తారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి రంగప్పనాయుడు పాలెం క్రాస్‌, నందిగుంట పాలెం మీదుగా సంతరావురు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు.  

Back to Top