టీడీపీ పాలనలో ఐటిరంగం కుదేలు...

వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసిన యువత
విశాఖః దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన హయాంలో యువతకు ఎన్నో ఉద్యోగవకాశాలు కల్పించారని విశాఖ యువత గుర్తుచేసుకున్నారు.
విశాఖ యువత పాదయాత్రలో ప్రతిపక్ష నేత  వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకున్నారు  చంద్రబాబు అబద్ధపు  వాగ్దానాలతో యువతను మోసం చేశారని యువత మండిపడ్డారు.  వైయస్‌ఆర్‌ హయాంలో భవనాలను తక్కువ ధరలకే ఐటి రంగాలకు  లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు.చంద్రబాబు పాలనలో సొంత బినామీలకు కేటాయించి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించిభరోసా ఇచ్చారని యువత తెలిపారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి కంపెనీలు వస్తాయని మీ సొంత ఊరులోనే ఉద్యోగాలు ఇస్తామన్నారని తెలిపారు.
  
Back to Top