విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర

వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికిన నేతలు, ప్రజలు
పార్టీ జెండా ఆవిష్కరించిన జననేత..



విజయనగరంః వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైయస్‌జగన్‌కు పార్టీనేతలు బొత్స,భూమన, కోలగట్ల, పి.రాజన్నదొర, పుష్పశ్రీవాణి, మాజ్జి శ్రీనివాసరావు, పెన్మత్స సాంబశివరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు వైయస్‌ జగన్‌పై విజయనగరం వాసులు పూలవర్షం కురిపించారు. చింతలపాలెం వద్ద వేదమంత్రాలతో వేదపడింతులు ఆశీర్వచనం ఇచ్చారు.పార్టీ జెండాను వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. రాజన్న రాజ్యం  స్థాపనకు ప్రజా సంకల్పయాత్ర నాంది పలుకుతుందన్నారు. విజయనగరం జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది.
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 11 జిల్లాలలో మూడు వేల కిలో మీటర్లు పాదయాత్ర పూర్తిచేసుకున్నా రు. ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజల రాకతో జాతరలను తలపించాయి. పాదయాత్రలో తెలుసుకున్న ప్రజ ల కష్టాలపై అధికార పార్టీపై వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగసభలలో విమర్శలు ఎక్కుపెడుతుంటే పెద్ద పెట్టున హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు తెరపడినట్టయిందని రాష్ట్రప్రజలు భావిస్తున్నారు.


అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాస్పంద‌న ల‌భిస్తోంది. అడుగ‌డుగునా జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. 3 వేల కిలోమీటర్లకు పైగా అలుపెరగని బాటసారి సాగిస్తున్న పాదయాత్ర ప్రతీ అడుగులోనూ ఇదే సన్నివేశం. అధికార పక్షంలో గుబులు పుట్టిస్తున్న ఈ జనసునామీని అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి రాజకీయ సర్వే బృందాలు నడుం బిగించాయి. ఎందుకొస్తున్నారీ జనం? ఓ నేత కోసం ఈ స్థాయిలో జన ప్రవాహమేంటి? అన్నది ఇప్పుడు అన్ని వర్గాలను అలోచింపజేస్తున్న ప్రశ్న. ప్రజలను రప్పించే ప్రయత్నాల్లేవు.. ఎవరికి వారే నిర్వాహకులు.. ఒకొక్కరూ ఒక్కో సైనికుడిలా పనిచేస్తున్నారు.  పాదయాత్ర సాగే ప్రాంతాల్లో వైయ‌స్ జగన్‌ను స్వాగతించడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఏ ఊరికావూరు ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. పండగొచ్చినట్టు మహిళలు పట్టు చీరలు కట్టుకొస్తున్నారు. గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాకిళ్లను రంగవల్లులతో అలంకరిస్తున్నారు.  ముగ్గుల పోటీల వాతావరణం జగన్‌ పాదయాత్ర సాగే గ్రామాల్లో ఆవిష్కృతమవుతోంది. తోరణాలు కట్టే వాళ్లు కొందరైతే.. దారిపొడవున పూలబాట వేసేవారు మరికొందరు. వారంద‌రికీ భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.


తాజా వీడియోలు

Back to Top