జననేతను కలిసిన మహిళలు

కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని డ్వాక్రా మహిళలు కలిశారు. సోమవారం వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించగా స్థానిక మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బ్యాంకు రుణాలు మాఫీ కాలేదని, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ ఏడాది పాటు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వచ్చాక నాలుగు విడతల్లో మీ రుణాలు అన్ని కూడా మాఫీ చేసి ఆ  డబ్బులు మీ చేతికే ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top