తాగేందుకు నీళ్లివ్వండి చాలు...కొల్లేరు ప్రాంత మహిళలు

తమకు మంచినీళ్లు కావాలని, ఉప్పునీళ్లు తాగలేక, ఖరీదైన నీటిని కొనలేక
నానాపాట్లు పడుతున్నామని కొల్లేరు  మహిళలు వాపోయారు. దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే
పరిస్థితి లేదని, అందుబాటులో ఉన్న ఈ నీళ్లు తాగితే రోగాలు వచ్చేస్తున్నాయంటూ వాపోయారు.
స్థానికంగా లభిస్తున్న రంగు మారిన నీటిని బ్యాటిళ్లలో నింపి తెచ్చి జననేతకు
చూపించారు. కైకలూరు నుంచి పైపులేస్తే చాలు తమ ప్రాంతానికి మంచినీరు సరఫరా అయి
కనీసం తాగేందుకు నీళ్లు వస్తాయని వివరించారు. వీరి సమస్యలను విన్న వైయస్ జగన్
మోహన్ రెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ వారిలో భరోసా నింపారు. కొల్లేరు
వాసుల సమస్యలు విన్న వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు

Back to Top