ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడుతున్నాం


తూర్పుగోదావరి: ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం తమ వృత్తిని రోడ్డున పడేస్తున్నదని కోనసీమ దస్తావేజులేఖర్లు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వ్యక్తులు దస్తావేజులు రాస్తూ తమను కించపరుస్తున్నారని, ఈ వృత్తినే నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతోందని మొరపెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దస్తావేజులేఖర్లు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు వివరించారు. తెలుగుదేశం సర్కార్‌ తమ లైసెన్స్‌లను రద్దు చేసిందని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. 
 
Back to Top