కిక్కిరిసిన వేంప‌ల్లె వీధులు

వేంపల్లి: ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపేందుకు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వైయస్‌ఆర్‌ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 6వ తేదిన ఇడుపులపాయలో ప్రారంభమైన వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదటి రోజు వేంపల్లి శివారులో ముగిసింది. మంగళవారం ఉదయం వేంపల్లి నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభం కాగా అడుగడుగున జనం బ్రహ్మరథం పడుతున్నారు. వేలాదిగా ప్రజలు తరలిరావడంతో యాత్ర షెడ్యూల్‌ కంటే ఆలస్యంగా సాగుతోంది. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని జననేత ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు ఓపికతో వింటూ, పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు.. మరి కాసేపట్లో వేంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. వైయస్‌ జగన్‌ వస్తున్నారన్న సమాచారంతో ప్రజలు పనులు మానుకొని ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. జననేత రాకతో వేంపల్లి వీధులు కిక్కిరిసిపోయాయి.  ఇక్కడ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చంద్రబాబు హామీలపై ఆరా తీయనున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో మేం కూడా పాల్గొంటామని ఎందరో ముందుకు వస్తున్నారు. షెడ్యూల్‌ ఈ రోజు 12 కిలోమీటర్లు ఉండగా, నిర్ణయించుకున్న షెడ్యూల్‌ కన్న ఆలస్యంగా సాగుతోంది. ఉదయం బయలుదేరినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి వైయస్‌ జగన్‌కు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర తరువాత ముఖ్యమంత్రి అయి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లు మాదిరిగా అమలు చేశారని, మహానేత మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా తమ సమస్యలు పరిష్కరిస్తారని జనం విశ్వసిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చి జననేతను కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేశారని యువత తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదు. ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వారి సూచనల మేరకే మేనిఫెస్టో తయారు చేస్తామని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. 

Back to Top