అత్యాచార నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి

హైదరాబాద్‌: గుంటూరు జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. డిచేపల్లిలో జరిగిన ఈ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో వరస ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఇటీవల మహిళలపై దాడులు అధికమయ్యాయని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అన్యాయాలకు అంతే లేదని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను కుప్పకూల్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
 
Back to Top