వైయస్‌ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాకు చెందిన నిరుద్యోగులు కలిశారు. స్థానికంగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో బెంగుళూరుకు వలస వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తీసుకువస్తే తమ బతుకులు బాగుపడుతాయని వైయస్‌ జగన్‌ను కోరారు. ఇందుకు జననేత సానుకూలంగా స్పందించారు. అందరం కలిసి ఉద్యమిద్దామని వైయస్‌ జగన్‌ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. 
 
Back to Top