ఉల్లిక‌ల్లు గ్రామాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు


అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామ‌ని ఉల్లిక‌ల్లు గ్రామాన్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ్రామ‌స్తులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. చాగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ ముంపు బాధితులు గురువారం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలో ఐదు గ్రామాలు ముంపుకు గురి కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 4 గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప‌రిహారం ఇచ్చి, మా  గ్రామాన్ని విస్మ‌రించార‌న్నారు. మేం వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నామ‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఊర్లో ఎవ‌రైనా చ‌నిపోతే పూడ్చేందుకు స్థ‌లం లేద‌ని, మాకు ప‌రిహారం చెల్లిస్తే ఊరు ఖాళీ చేస్తామ‌ని తెలిపారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక ప‌రిహారం చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో గ్రామ‌స్తులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top