వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన గిరిజన సంఘ నేతలు

అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా అనంత‌పురం జిల్లా గుత్తి మండ‌లం బ‌సినేప‌ల్లిలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గిరిజ‌న సంఘం నేత‌లు క‌లిశారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో గిరిజ‌నుల అభివృద్ధిని విస్మ‌రించార‌ని వారు ఫిర్యాదు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక గిరిజ‌నుల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గిరిజ‌న సంఘం నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వీరి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ వారికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top