నేడు రామచంద్రపురంలో బహిరంగ సభ


 తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారం రామచంద్రపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగుతోంది.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్నవారికి భరోసా కల్పిస్తూ జననేత సాగిస్తున్న పాదయాత్ర రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం నుంచి ప్రారంభ‌మైంది. చిన్నతాళ్ళపొలం, పెద్దతాళ్ళపొలం, వెల్ల క్రాస్‌ మీదుగా రామచంద్రపురం పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.
Back to Top