ఇవాళ జి.మామిడాడలో భారీ బహిరంగ సభ

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జననేతకు ఘన స్వాగతం పలికేందుకు వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మామిడాడ మొత్తం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నిండిపోయింది. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివస్తున్నారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top