నేడు ముమ్మిడివరంలో భారీ బ‌హిరంగ స‌భ


తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 201వ రోజైన శనివారం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలోకి ప్రవేశించనుంది. సుదీర్ఘ పాదయాత్రికుడు, తమ అభిమాన నేత జగన్‌కు ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నాయి. ఇందుకోసం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అనాతవరం మీదుగా మహిపాల చెరువు, బొండాయికోడు, కొండాలమ్మ చింత, ముమ్మిడివరం వరకూ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో దారి పొడవునా ప్రజలతో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మమేకం కానున్నారు. అనంతరం ముమ్మిడివరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.


Back to Top