వైయస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు

 గుంటూరు:ప్రజా సంకల్ప యాత్ర 116వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పొగాకు రైతులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు.  పొగాకుకు మద్దతు ధర లేదని, ప్రస్తుతానికి రూ.5 వేలు మద్దతు ధర ఉందని, రూ.7 వేలు అయితే కనీసం పెట్టుబడులు చేతికందుతాయని చెప్పారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. అలాగే వ్యవసాయ కూలీలు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. కష్టపడి పిల్లలను చదివిస్తే ఉగ్యోగాలు రాలేదని వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
Back to Top