ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాలి


కృష్ణా జిల్లా: ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇప్పించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌జగన్‌ మోహన్‌ రెడ్డిని దేవాదాయ శాఖ సిబ్బంది కలిశారు. దేవదాయ శాఖలో వచ్చిన ఆదాయంలో 30 శాతమే వేతనాలు తీసుకోవాలని ఆంక్షలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తమకు ఎలాంటి అవకాశం కల్పించడం లేదని, పిల్లను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖజానా ద్వారా తమకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు వైయస్‌ జగన్‌ను కోరారు. మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు దేవాదాయ ఉద్యోగులు పేర్కొన్నారు. 
Back to Top