వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఉపాధ్యాయులు

గుంటూరు :మున్సిపల్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ వైయ‌స్ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. థామస్‌రెడ్డి జననేతను కోరారు. పాదయాత్రలో భాగంగా గుంటూరులో జననేతను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు, జీపీఎఫ్‌ సౌకర్యం, బదిలీలు, పోస్టుల అప్‌ గ్రేడేషన్, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న జెడ్పీ స్కూళ్లను కార్పొరేషన్‌లో విలీనం, సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ బకాయిల చెల్లింపుతో పాటు నూతన పీఆర్సీ కమిటీ నియామకంపై పోరాటం చేస్తున్నట్టు వివరించారు. కె. జవహర్‌బాబు, పి.జగదీష్, టి.రవితదితరులు జననేతను కలిశారు.

 

తాజా వీడియోలు

Back to Top