కర్నూలు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఎమిగనూరు మండల ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైయస్ జగన్‌ను కలిసి బాధను చెప్పుకున్నారు. కర్నూలు జిల్లాలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైయస్ జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు సీపీఎస్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు స్పందించిన వైయస్ జగన్ పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.