సీపీఎస్‌ విధానం రద్దు చేయాలి

 
చిత్తూరు: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చింతపర్తి గ్రామంలో ఎస్టీయూ నాయకులు  ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని మాట ఇచ్చారు. జననేత హామీతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top