వైయస్‌ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు

వేంపల్లి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అన్నారు. వేంపల్లి చేరిన ప్రజాసంకల్పయాత్రను ఉపాధ్యాయ సంఘాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం గురించి వారు వైయస్‌ జగన్‌కు విన్నవించారు. వైయస్‌ఆర్‌ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగా స్థలం కేటాయించి ఇల్లు కటిస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీతో మాలో భరోసా నింపిందని వారంతా చెప్పారు. విద్యారంగ సమస్యలపై దృష్టి పెడతానని జననేత వారికి హామీ ఇచ్చారు. పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్యపై దృష్టిపెడతానన్నారు. 

Back to Top