కొనసాగుతున్న చేరికల పరంపర

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేరిక పరంపర కొనసాగుతోంది. వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధాంతాలు మెచ్చి.. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పోరాటాలు మెచ్చి టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. రాజమండ్రి 47వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు తిరగటి దుర్గారావుతో పాటు 150 మంది జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
Back to Top