మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర

– శిల్పా చక్రపాణిరెడ్డి
కర్నూలు: బనగానపల్లె నియోజకవర్గంలోని హుశ్సేనాపురం గ్రామంలో వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సదస్సును అడ్డుకునేందుకు అధికార టీడీపీ కుట్రలు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. పోలీసుల సహాయంతో మహిళలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశౠరు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ తీరు మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాత్రికి రాత్రి సదస్సుకు అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు.
 
Back to Top