43వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ మేరకు 43వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కదిరి పట్టణం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలుపెడతారు. 8.30 గంటలకు మరవతాండ కదిరికి చేరుకుంటారు. అక్కడి నుంచి గంగన్నపల్లె క్రాస్, కమతంపల్లె, మిద్దివారిగొండి, దొర్నాల నల్లవారిపల్లె, కటారుపల్లి వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం. 3 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది.  అక్కడి నుంచి గాండ్లపెంట వరకు యాత్ర కొనసాగుతోంది.
 
Back to Top