టీడీపీకి చరమగీతం పాడుదాం

అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పిలుపునిచ్చారు. రాప్తాడు మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 2014లో పాదయాత్ర చేస్తూ అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. లేనిపోని మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. బలహీన వర్గాలకు చెందిన కులాలను క్యాటగిరిలు మార్చుతానని అబద్ధపు హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతల అరాచకాలు విఫరీతంగా పెరిగాయన్నారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాతో అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని, పట్టపగలే హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక మంది వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలను మట్టుబెట్టారని ధ్వజమెత్తారు. ప్రజాధరణకలిగిన బీసీ నాయకుడు ధనుంజయ నాయుడిపై హత్యాయత్నం చేశారన్నారు. పేరూరు డ్యామ్‌ కోసం రూ. 1300 కోట్లలో అంచనాలు పెంచారని, ఇందులో టీడీపీకి ఎంత వాటా ఉందో చెప్పాలని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో రాప్తాడులో బీభత్సం సృష్టించి మళ్లీ గెలవాలనే కుట్రలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. పేదలకు పక్కా ఇల్లు లేక బాడుగ ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఇళ్లపై టీడీపీ జెండాలు పెడుతున్నారని, ఎవరబ్బ సొమ్ము అది అని ప్రశ్నించారు. ఖబర్డార్‌ టీడీపీ నేతలారా..వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని హెచ్చరించారు.
 


Back to Top