వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రత్యేక పూజలు

గన్నవరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఇందుకూరుకు చెందిన వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు ఆకాంక్షించారు. ఈ మేరకు ఇందుకూరు సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌కు ప్రసాదం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజలంరికీ ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి జననేత వెంటనే ఉన్నానని, ఆయన ముఖ్యమంత్రి కావాలని, పాదయాత్ర విజయవంతం కావాలని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామన్నారు. 
Back to Top