ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోండి సార్‌

 
అనంతపురం: ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కోరారు. మల్కాపురం క్రాస్‌ వద్ద శనివారం ఈయూ నాయకులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొస్తానని, ఉద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top