జననేతను కలిసిన ఆర్టీసీ కార్మికులు


విజయవాడ: చంద్రబాబు పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు తమ గోడును జననేతతో వెల్లబోసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాముల కాల్వకు చేరుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అధిక పని భారంతో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మోసపోలేక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు వైయస్‌ఆర్‌ వర్కర్స్‌ యూనియన్‌గా ఏర్పడ్డామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top