జననేతను కలిసిన ఆర్‌ఎంపీ, పీఎంపీలు

గుంటూరు: తమ న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చడంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న  ప్రజా సంకల్ప యాత్రలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైద్యులు చిరునవ్వులతో ఉండాలని, ఆ విధమైన పాలన చేస్తానన్నారు. 
 
Back to Top