డీఎస్సీలో పోస్టులు ప్రకటించేలా ఒత్తిడి తెండి

పశ్చిమగోదావరి: దివ్యాంగుల కేంద్రంలో ఉపాధ్యాయ పోస్టులను కేటాయించేలా చూడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉపాధ్యాయులు కలిశారు. 2006లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి దివ్యాంగ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారని.. ఆ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కేంద్రంలో 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఉపాధ్యాయ పోస్టులను ఇచ్చిందని, వాటిని వెంటనే 2018 డీఎస్సీలో ప్రకటించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను విన్న జననేత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top