అవినీతి నిరూపించేందుకు సిద్ధం

గుంటూరు

: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌ చేసిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కావటి శివనాగ మనోహర్‌నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని చెప్పారు. అవినీతిపై ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు రెడీగా ఉన్నానన్నారు. ప్రజలే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి తీర్పు చెబుతారన్నారు. అందుకు ప్రత్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్‌ కూడా సిద్ధంగా ఉండాలన్నారు. 600ల హామీలిచ్చిన తెలుగుదేశం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో చెబుతామన్నారు. ప్రజల నుంచి వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ ఓర్వలేక పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.   

Back to Top