రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తో సాధ్యం

పత్తికొండ: సీఎం చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగివేసారిపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. పత్తికొండ నియోజకవర్గం ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న బీవై రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. బేతంచర్ల వద్ద కరెంటు చార్జీలు పెరిగి ఇండస్ట్రీలు మూతపడ్డాయని, రైతులకు గిట్టుబాటు ధరలేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీకాక వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారన్నారు. వారంతా తమ బాధలు వైయస్‌ జగన్‌కు చెప్పుకోవడానికి యాత్రకు కదిలి వస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకువస్తామని వైయస్‌ జగన్‌ ప్రజలకు హామీ ఇస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాను సాగు, తాగునీటి సమస్య, నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. సీఎం అయిన మొదటి సారి కర్నూలు జిల్లాకు జెండా ఆవిష్కరణకు వచ్చిన చంద్రబాబు 50 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అబద్ధాలతో మోసపోయిన రాష్ట్ర ప్రజానికం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. 
Back to Top