ప్రజాసంకల్ప యాత్రకు రజక సంఘం మద్దతు

  • తమను ఎస్సీల్లో చేర్చాలని వైయస్‌ జగన్‌ను కలిసిన నేతలు
  • అధికారంలోకి రాగానే ఎస్సీలుగా గుర్తిస్తామని జననేత హామీ
ప్రొద్దుటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ఆంధ్రప్రదేశ్‌ రజక సంఘం మద్దతు తెలిపింది. తమను ఎస్సీల జాబితాలో చేర్చుతామన్న చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య మాట్లాడుతూ... భారతదేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా గుర్తంచబడ్డారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రజకులను ఎస్సీలుగా చేర్చాలని అనేక పోరాటాలు చేశామని, 2008లో హైదరాబాద్‌లో రజకులను ఎస్సీలుగా చేయాలని మహాధర్నా చేస్తే ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2016లో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంలో రజకులను ఎస్సీ జాబితాల్లో చేర్చుతామని చెప్పించామన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రజకులను ఎస్సీల్లో చేర్చేది నా చేతిలో లేదని, అది కేంద్రం పరధిలో ఉందని మాట మార్చారన్నారు. ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రిని  కలిసినా ఫలితం శూన్యమన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు సమస్య చెప్పగానే నేను మాయమాటలు చెప్పనుగానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులను ఎస్సీలుగా చేర్చుతామని హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌కు రజక సంఘం పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొని ఎన్నో ఏళ్లుగా మరుగునపడిన మా కలను సహకారం చేసుకుంటామని రజకసంఘం నాయకులు స్పష్టం చేశారు. 
Back to Top