ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయం

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 210వ రోజు ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయంగా మారింది. దీంతో ఉదయం ప్రారంభం కావాల్సిన పాదయాత్ర మరింత ఆలస్యం కానుంది. ఇవాళ జనేనత పాదయాత్ర మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి ప్రారంభమై..అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్‌ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు కొనసాగనుంది. కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు వైయ‌స్‌ జగన్‌ రాకకోసం ఎదురుచూస్తున్నారు.  
 

Back to Top