కృష్ణా జిల్లా: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గన్నవరం నియోజకవర్గంలోని దావాజీగూడెం వద్ద ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్‌కు వివరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.