వైయ‌స్‌ జగన్‌ను కలిసిన శిల్పకారులు

ఆళ్ల‌గ‌డ్డ‌:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని శిల్పకారులు క‌లిశారు. గురువారం వైయ‌స్ జ‌గ‌న్  ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పదో రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి  ఆళ్ల‌గ‌డ్డ శివారులోని హైవే వ‌ద్ద‌కు చేరుకోగా స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం శిల్ప‌కారుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. 
Back to Top