పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రిజిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆదివారం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని అచ్చెంపేట జంక్ష‌న్ నుంచి ప్రారంభ‌మైంది. సామర్లకోట మండలం గొంచాల వ‌ద్ద జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాజ‌న్న బిడ్డ‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
         


Back to Top