గూడూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 నెల్లూరు :   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 74వ రోజు నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ప్రారంభ‌మైంది.  సోమవారం ఉదయం వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ముందుగా గోగినేని పురానికి పాదయాత్ర చేరుకుంటుంది. అటుపై చెన్నూరు క్రాస్‌, వెంకటగిరి క్రాస్‌ మీదుగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోకి ఆయన ప్రవేశిస్తారు. భోజన విరామం అనంతరం తూర్పు పుండ్ల మీదుగా సైదాపురం ఎంట్రన్స్‌కు ఆయన చేరుకుంటున్నారు. అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
Back to Top