తిమ్మ‌స‌ముద్రం క్రాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

నెల్లూరు :   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన  ప్రజాసంకల్పయాత్ర 73వ రోజు ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా తిమ్మ‌స‌ముద్రం క్రాస్‌ నుంచి  ప్రారంభ‌మైంది. అక్కడ నుంచి కొండగుంట, పాలిచెర్ల మీదుగా గాంధీనగర్‌ చేరుకుంటారు. దారిపోడవునా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఆపై భోజన విరామం అనంతరం ఇందిరమ్మ కాలనీ మీదగా గూడురు కోర్టు సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ జనవాహినిని ఉద్దేశించి బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 
Back to Top