ముగిసిన 57వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

చిత్తూరు:  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 57వ రోజు పాద‌యాత్ర కొద్దిసేప‌టి క్రిత‌మే చిప్ప‌ర్ల‌ప‌ల్లి వ‌ద్ద ముగిసింది.  మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం బత్తలవారిపల్లి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మిట్టపాల్యం, వెంకటాపురం గ్రామాల మీదుగా బండకింద పల్లి, రాఘవరెడ్డి పల్లి, మణిక్య రాయుని పల్లి,  కార్తికేయపురం, అట్టవారిపల్లి గ్రామాల మీదుగా పెనుమూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పెనుమూరు నుంచి గొబ్బిల్లమిట్ట, గాంధీపురం మీదుగా చిప్పరపల్లి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ముగించారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ 13.4 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశారు.  
Back to Top