మొరవపాటూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

చిత్తూరు : వైయ‌స్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర  చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా సాగుతోంది. 56వ రోజు పూతలపట్టు నియోజక వర్గంలోని  మొరవపాటూరు నుంచి  వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్ర ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి కొండారెడ్డిపల్లి క్రాస్‌ నుంచి తలుపులపల్లి గ్రామం చేరుకొని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.  తిమ్మిరెడ్డిపల్లి , తోటలోపు, టీ రంగం పేట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నాం భోజన విరామం అనంతరం  రంగంపేట క్రాస్‌ చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.  మధ్యాహ్నాం పూతలపట్టు చేరుకొని అక్కడ బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. తదుపరి సమనత్తం మీదుగా అనంతాపురం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. 


Back to Top