చిన్నంప‌ల్లి క్రాస్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం

 అనంతపురం : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 33వ రోజు రాప్తాడు నియోజకవర్గం చిన్నంపల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి  ప్రారంభించారు.  కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్‌ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకుంటారు. అక్కడ ఆయన పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆయన జనంతో మమేకం కానున్నారు. ఆపై వైయ‌స్ఆర్ కాలనీ, అక్కంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నాం భోజన విరామనంతరం తిరిగి పాదయాత్ర చేపడతారు.  సాయంత్రం పాపంపేట వద్ద బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు.  

Back to Top