159వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 159వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శ‌నివారం ఉదయం కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌వ‌ల్లి మండ‌లంలోని గ‌న్న‌వ‌రం క్రాస్ నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచిమండ‌వ‌ల్లి, చెగురు కోట క్రాస్‌,బైర‌వ ప‌ట్నం వ‌ర‌కు సాగుతుంది. మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం చావ‌ల్లిపాడు, కైక‌లూరు గాంధీబొమ్మ సెంట‌ర్ వ‌ర‌కు సాగుతుంది. కౌక‌లూరు గాంధీ బొమ్మ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు. 

Back to Top