136వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  
 విజయవాడ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు , ప్రతిపక్ష నాయకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నుంచి శనివారం ఉదయం  పాదయాత్రను వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. కనకదుర్గ వారధి గుండా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్‌, శిఖామణి సెంటర్‌, పుష్పా హోటల్‌ సెంటర్‌, సీతారాంపురం సెంటర్‌ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. అక్కడి నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్‌కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చిట్టినగర్‌ సెంటర్‌లో జరిగే బహిరంగం సభలో జననేత ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ వద్ద యాత్ర ముగిస్తారు.
Back to Top